![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -201 లో... రుద్ర అకాడమీ తరపున దీప్తి బాక్సింగ్ పోటీలో పాల్గొంటుంది. తనని ఆపాలని పారు ఇంకా వాళ్ళ అన్నయ్య విశ్వ ప్రయత్నాలు చేస్తారు. తనతో ఎక్కువ వర్క్ఔట్స్ చేపిస్తారు. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు.
పారు మనిషి దీప్తి దగ్గరికి భోజనం తీసుకొని వస్తాడు. అందులో ఏదో కలిపి తీసుకొని వస్తాడు. దాంతో దీప్తికి డౌట్ వచ్చి ఫుడ్ తినదు. రుద్ర తన మనిషి ద్వారా భోజనం తెప్పించి దీప్తికి ఇస్తాడు.
మరొకవైపు బాక్సింగ్ పోటీలో దీప్తి పార్టిసిపేట్ చేస్తుందని రుద్ర త్వరగా రెడీ అవుతాడు. గంగ తనకి కాఫీ తీసుకొని వస్తుంది. నువ్వు కూడా రా అక్కడ దీప్తికి తోడుగా ఉండొచ్చని రుద్ర అంటాడు. పెద్దమ్మకి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నామని అబద్ధం చెప్తానని రుద్ర అంటాడు.
ఇద్దరు రెడీ అయి హాల్లోకి వస్తారు. ఎక్కడికి అని శకుంతల అడుగుతుంది. గంగ పుట్టినరోజుకి అంటుంది. రుద్ర పెళ్లికి అని అంటాడు. మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ పెళ్లి రోజు.. వాళ్ళ పాప బర్త్ డే అని రుద్ర కవర్ చేస్తాడు. దాంతో శకుంతల సరే త్వరగా రమ్మని చెప్తుంది.
ఇషిక, వీరుకి డౌట్ వస్తుంది. దాంతో శకుంతల దగ్గరికి వెళ్లి వాళ్ళు అకాడమీకి వెళ్తున్నారు. మీతో అబద్ధం చెప్పారు. కావాలంటే నాతో రండి అని శకుంతలతో వీరు, ఇషిక అంటారు. శకుంతల వాళ్ళతో వెళ్తుంది.

రుద్ర కార్ ని ఫాలో అవుతూ వెళ్తారు. అలా వాళ్ళు వెనకాల రావడం గంగ చూసి రుద్రకి చెప్తుంది. దాంతో రుద్ర ఒక పెళ్లి దగ్గర డైవర్ట్ అవుతాడు. అది చూసిన శకుంతల.. చూసారా వాళ్ళు పెళ్లికి వెళ్లారు. అనవసరంగా నన్ను తీసుకొని వచ్చారని వీరూతో అంటుంది.
మరొకవైపు దీప్తి వెంట రౌడీలు పడుతారు. రుద్ర, గంగ ఇద్దరు వీరు వాళ్ళ కార్ ని డైవర్ట్ చేసి అకాడమీకి వెళ్తుంటే దీప్తి ఎదురుగా వచ్చి పడిపోతుంది. దాంతో రౌడీలు వెళ్ళిపోతారు. దీప్తిని వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలని గంగ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |